GNTR: తెనాలికి చెందిన సినీ మాటల రచయిత, నంది అవార్డు గ్రహీత సాయి మాధవ్ బుర్రా ‘సినీ సంభాషణా శిల్పి’ బిరుదు పొందారు. అమెరికాలోని డల్లాస్‌లో ఈ నెల 24న తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతినిధులు సాయి మాధవ్‌కు ఈ బిరుదు ప్రదానం చేసి సత్కరించారు. తెనాలిలో కళాకారుల కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనంలోనే రంగస్థలం నటుడిగా గుర్తింపు పొందారు.