ADB: పెన్ గంగా నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో స్రవంతి స్పష్టం చేశారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల నేపథ్యంలో ఇసుక రవాణాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం ఆర్డీఓ ఉమ్మడి జైనథ్ మండలంలోని కౌఠ, సాంగ్వి, పెండల్వాడా, తర్నం గ్రామాల్లో పర్యటించారు. తర్నం వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నారు.