ATP: రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వీధిలో వెలసిన ప్రసిద్ధ దసభుజ మహా వినాయకుడిని వైసీపీ రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి పోరాళ్ల శివ, మున్సిపల్ చైర్ పర్సన్ శిల్ప బుధవారం వినాయక చవితి సందర్భంగా దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వెండి కొమ్మును స్వామివారికి దానమిచ్చారు.