NLR: సంగం మండలంలోని తలుపూరుపాడు గ్రామంలో బుధవారం జల జీవన మిషన్ కింద వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయ కొట్టి ప్రారంభించారు. వీలైనంత త్వరగా వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.