ATP: ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామానికి చెందిన రాధాకృష్ణ అనే విద్యార్థి ఎంబీబీఎస్ ఉచిత సీటు సాధించాడు. రామకృష్ణ కుమారుడు రాధాకృష్ణ తొలి ప్రయత్నంలోనే నీట్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 7,094 ర్యాంకు సాధించి మెడికల్ కాలేజీలో ఉచిత సీటు దక్కించుకున్నాడు. విద్యార్థి రాధాకృష్ణను పట్టణ ప్రజలు అభినందించారు.