KDP: చెన్నూరు మండల కేంద్రంలోని నాగలకట్ట వీధిలో వినాయక చవితి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కోడూరు కమలాకర్ శర్మ వినాయక మహత్యం కథా కాలక్షేపం నిర్వహించి, భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీరామ ఉత్సవ కమిటీ, నాగలకట్ట వీధి వారు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. కాగా, మూడవ రోజున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు.