MDK: జిల్లా ప్రజలకు ఎస్పీ డి.వి. శ్రీనివాస్‌రావు వినాయక చతుర్థి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చతుర్థి పండగను ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో, మత సామరస్యంతో పండుగ జరుపుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని, అలాగే ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటామని అన్నారు.