CTR: పలమనేరు మున్సిపల్ సాధారణ సమావేశం ఈనెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు మున్సిపల్ మీటింగ్ హాలులో జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఎన్.వి.రమణారెడ్డి తెలిపారు. మున్సిపల్ ఛైర్పర్సన్ చాముండేశ్వరి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.