వినాయక చవితి మండపాలు, లౌడ్ స్పీకర్లతో ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని హైకోర్టు ఆదేశించింది. అధిక శబ్దాల వల్ల వృద్ధులు, గర్భిణులకు సమస్యలు వస్తాయని, రోడ్లకు అడ్డంగా మండపాలు పెడితే అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు వెళ్లడం కష్టమని కోర్టు పేర్కొంది. స్థానిక సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మైదానాలు, ఖాళీ స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.