TG: హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం మొదలైన వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. పఠాన్‌చెరు, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్, అల్వాల్, ముషీరాబాద్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సహా చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.