MBNR: రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే దేవరకద్ర నియోజకవర్గంలో ఈ సీజన్లో ఎక్కువగా వరినట్లు వేశారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో కొందరు డీలర్లు ఉద్దేశపూర్వకంగా యూరియా కొరత సృష్టించి ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.