MHBD: పెన్షన్ దారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ పెంపు హామీ నెరవేర్చాలని గూడూరు మండల వికలాంగుల హక్కుల సమితి అధ్యక్షుడు గుర్రం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని గోవిందపురంలో బుధవారం పెన్షన్ దారుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి సెప్టెంబర్ 9న మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేపట్టబోయే మహా గర్జన సభకు తరలి వెళ్లాలన్నారు.