KMM: నగరంలో త్వరలో ప్లాస్టింగ్ వ్యర్థాల రీసైక్లింగ్ ప్రారంభిస్తామని నగర మేయర్ నీరజ అన్నారు. మంగళవారం ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్లో అమలు చేస్తున్న ఆధునిక వ్యర్థ నిర్వహణ విధానాలు ఖమ్మంలో కూడా అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మేయర్ పేర్కొన్నారు.