W.G: పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఈనెల 29న శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి మంగళవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో పది కంపెనీల ద్వారా ఇంటర్వ్యూ లు నిర్వహిస్తున్నామన్నారు. ఇంటర్వ్యూకు డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు.