KMR: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని డీఈ విజయసారథి తెలిపారు. డివిజన్ పరిధిలో వర్షాల కారణంగా దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను మార్చే ప్రక్రియ నేపథ్యంలో సరఫరా నిలిచిపోయిందన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు కరెంటు తీగలను ముట్టుకోకూడదని సూచించారు.