NRML: భైంసా పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయంలో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ బుధవారం పట్టణ హిందూ ఉత్సవ సమితి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. అనంతరం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఏఎస్పీ అవినాష్ కుమార్ , సీఐ గోపీనాథ్ పాల్గొన్నారు.