KMR: జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. దీంతో రేపు విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్లు డీఈవో రాజు ప్రకటించారు. స్కూళ్లు, కాలేజీలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. అటు వర్ష ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని విద్యార్థుల పేరెంట్స్ కోరుతున్నారు.