ATP: గుత్తిలోని బండగేరి యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన 15 అడుగుల వినాయకుడు ఎంతగానో ఆకట్టుకున్నాడు. బండగేరి యువకుడు రవి మాట్లాడుతూ.. 15 అడుగుల ఈ వినాయకుడిని హైదరాబాదు నుంచి తీసుకుని వచ్చామన్నారు. గుత్తిలోనే ఇంత పొడవైన విగ్రహం ఎక్కడా లేదన్నారు. ఈ విగ్రహాన్ని చూడడానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో తరలివస్తున్నారని తెలిపారు.