KDP: మైదుకూరు పురపాలక పరిధిలో వీధి కుక్కల పట్టివేత మంగళవారం చేపట్టారు. ప్రత్యేక వాహనంతో పొద్దుటూరు పురపాలక నుంచి వచ్చిన సిబ్బంది వివిధ ప్రాంతాల్లో వెంటాడి 20 కుక్కలను పట్టుకున్నారు. వీటిని పొద్దుటూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో శస్త్ర చికిత్సలు చేసి తిరిగి వదిలేస్తామని సిబ్బంది తెలిపారు.