ASF: సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు దంపతులు బుధవారం వినాయక చవితి సందర్భంగా వారి స్వగృహంలో వినాయక విగ్రహం ప్రతిష్టించారు. ఈ సందర్భంగా వినాయక వ్రతాన్ని ఆచరించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.