ప్రకాశ: పామూరు మండలంలో వినాయక విగ్రహాలు ఏర్పాటుచేసిన కమిటీ సభ్యులకు బుధవారం ఎస్సై కిషోర్ బాబు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కమిటీ సభ్యులు మండపం వద్ద ఉండి, ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. వినాయక నిమజ్జనం రోజున కూడా వేడుకను అత్యంత భక్తి శ్రద్దలతో సంతోషంగా జరుపుకోవాలని కోరారు.