NRML: జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో తిమ్మాపూర్‌లో బుధవారం రోడ్డు భద్రతా కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ నియమాల పాటించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడంపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ తిమ్మాపూర్‌లో 13, వానల్ పాడ్‌లో 18 సీసీ కెమెరాలను ప్రారంభించారు. జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.