NLR: రామలింగాపురం, హరనాథపురం, కూరగాయల మార్కెట్, మినీ బైపాస్ రోడ్డు ప్రాంతాలలో వినాయక చవితి షాపింగ్ సందర్భంగా రద్దీ ఏర్పడింది. ఉదయం నుంచి పూజ సామాగ్రి కొనుగోలు కోసం ప్రజలు పెద్ద ఎత్తున బయటికి వస్తున్నారు. చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ ఎక్కడా తగ్గడం లేదు. పూజకు అవసరమైన అరటి పిలకలు, పండ్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రహదారులు రద్దీగా మారాయి.