జమ్మూకశ్మీర్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కారణంగా వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 9 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. వరదల తాకిడికి భగతినగర్ దగ్గర తావి నది వంతెన కూలిపోయింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.