NZB: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్పల్లి ఆధ్వర్యంలో టైలరింగ్, మగ్గం వర్క్ కోర్సుల్లో ఉచిత శిక్షణకు మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన 19-45 సంవత్సరాల వయసు మధ్య ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.