ADB: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు మార్గాలను పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో R&B, ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇల్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు.