TG: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ‘మన రాష్ట్రం, దేశం ఐక్యత, శాంతి, శ్రేయస్సు కోసం నేను గణేశుడిని ప్రార్థిస్తున్నా. వినాయకచవితి వేడుకలు మీ అందరికీ ఆరోగ్యం, ఆనందాన్ని కలిగించాలి’ అని గవర్నర్ పేర్కొన్నారు. విఘ్నేశ్వరుడు అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు.