NLG: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఆర్థిక సాయం పొందడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు, కట్టంగూర్ MPDO పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు తెలిపారు. మంగళవారం MPDO కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కుటుంబ పెద్ద మృతి చెందినట్లయితే ప్రభుత్వం రూ.20 వేల ఆర్ధిక సాయం అందిస్తుందన్నారు. దరఖాస్తులు 28వ తేదీలోపు MPDO కార్యాలయంలో అందజేయాలని సూచించారు.