MBNR: మహబూబ్నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజలకు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయక చవితి వేడుకల సందర్భంగా ప్రజల సామాజిక బాధ్యతతో మట్టి వినాయకులను పూజించాలన్నారు. రసాయనలతో తయారుచేసిన వినాయక ప్రతిమల మూలంగా నీటి కాలుష్యం అవుతుందని పేర్కొన్నారు.