ATP: అనంతపురంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జగదీష్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలతో ఎస్పీ మాట్లాడారు. వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. నేటి కార్యక్రమంలో మొత్తం 60 అర్జీలను స్వీకరించామని ఎస్పీ తెలిపారు. చట్ట పరిధిలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.