ATP: కంబదూరు మండలం నూతిమడుగు గ్రామానికి చెందిన నాయిబ్రాహ్మణ ఉమామహేష్ పీఈటీ విభాగంలో జిల్లా మొదటి ర్యాంక్, రాష్ట్రంలో రెండో ర్యాంక్ సాధించారు. అనంతపురం ఎస్సార్సీ కార్యాలయంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆయనను ఘనంగా సన్మానించారు. ఉచిత డీఎస్సీ శిక్షణ అందించినందుకు ఎమ్మెల్యేకు నాయిబ్రాహ్మణ సోదరులు కృతజ్ఞతలు తెలిపారు.