CTR: ఐరాల మడలం తిరుపతి-బెంగళూరు హైవే మూర్తిగాని ఊరు సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి వైపు నుంచి చేపల లోడుతో వస్తున్న ఓ టాటా ఏస్ వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. అతి వేగంగా ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.