AP: తిరుపతి తుడ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. 123 మున్సిపాలిటీల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. అమృత్ స్కీమ్ కింద 3 ఏళ్లలో స్వచ్ఛమైన నీరు అందిస్తామని పేర్కొన్నారు. ఆరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందని ఆరోపించారు. ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు.