WGL: ప్రజల సమస్యల పరిష్కారంలో వరంగల్ పోలీస్ మరింత వేగం పెంచింది. ముఖ్యంగా సోషల్ మీడియా X (Twitter) ద్వారా వచ్చే ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందిస్తూ తక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను నేరుగా @cpwarangal, @warangalpolice పంపవచ్చని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 సేవలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు స్పష్టం చేశారు.