MHBD: కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని బీఆర్ఎస్ జిల్లా నాయకులు, మాజీ జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం మంగళవారం తొర్రూరు మండలంలోని అమర్ సింగ్ తండా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు జాటోత్ సురేష్ తండ్రి ఇటీవల అకాల మరణం చెందగా వారి కుటుంబానికి పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.