E.G: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలు రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్.బి.ఎం మురళీకృష్ణ ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రకాశం పంతులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.