KRNL: కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శుక్రవారం కర్నూలు మండలం పసుపుల గ్రామంలోని తన స్వగృహంలో గ్రీవెన్స్ రెడ్రెస్సల్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను, అభ్యర్థనలను నేరుగా ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఈ మేరకు ప్రతి ఒక్కరి ఫిర్యాదును శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.