BDK: కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఎస్పీ రోహిత్ రాజ్ ఇవాళ నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.