కోనసీమ: శ్రావణ బహుళ అమావాస్య, శని అమావాస్య సందర్భంగా ఆలమూరు మండలం చింతలూరు శ్రీనూకాంబికా అమ్మవారి ఆలయంలో ఇవాళ వైభవోపేతంగా చండీ హోమం నిర్వహించారు. ఋత్విక్కులు ఆగమోక్తంగా హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం భక్తులు నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు.