E.G: తొలగించిన దివ్యాంగుల పింఛన్లు కొనసాగించాలని ఉమ్మడి తూ.గో జిల్లా అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు పలివెల రాజు కోరారు. ఇవాళ రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలో జరిగిన దివ్యాంగుల సంఘాల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పుట్టుకతోనే వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు వైకల్య శాతం తగ్గించడం దారుణం అన్నారు.