MDK: హవేలీ ఘనపూర్ మండలం సర్ధన గ్రామంలో పిల్లి కృష్ణ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఏడాది క్రితం కూతురు అనారోగ్యంతో చనిపోయింది. కూతురు మరణం తట్టుకోలేక కృష్ణ మనస్థాపానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి ఇంట్లోంచి వెళ్లి గ్రామ సమీపంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం గుర్తించినట్లు ఎస్సై వివరించారు.