VSP: శ్రీ రాధాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో పూల అలంకరణ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 31న జరిగే ఈ పోటీలను రెండు విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు హరే కృష్ణ మూవ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ యదురాజ దాస శనివారం వెల్లడించారు. 12 నుంచి 16 ఏళ్ల బాలబాలికలకు , 16 ఏళ్ల పైబడిన మహిళలకు మరో విభాగంలో పోటీలు నిర్వహిస్తామన్నారు.