NLG: అత్యధికంగా విద్యార్థులు చేరిన పాఠశాలలకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తామని MLC పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన మునుగోడు MPPS పాఠశాలను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, ఉపాధ్యాయుల శ్రేయస్సుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంఖ్య పెంచిన ఉపాధ్యాయులు, పాఠశాల బృందాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.