W.G: రాష్ట్ర స్థాయిలో ఈ నెల 24 నుంచి తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా తరపున తణుకు ఏకేటీపీ పాఠశాల విద్యార్థిని తనిష్క ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు టి.రామకృష్ణ తెలిపారు. ఆదివారం పాఠశాలలో ఆమెకు అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. శాప్ ఆధ్వర్యంలో ఈనెల 22న కాకినాడలో జరిగిన పోటీల్లో బంగారు పతకం సాధించిందని అన్నారు.