SDPT: ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని పెద్దలంటారు. ఇప్పుడు రైతులకు ఆ కష్టమే వచ్చింది. పంటలకు కావాల్సిన యూరియా లభ్యం కాకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఎటు చూసినా రైతులు ఎరువుల కోసం క్యూలో గంటల తరబడి పడిగాపులుకాస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించాలి అని రైతులు డిమాండ్ చేస్తున్నారు.