SDPT: మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే స్వామివారి ఆలయ ప్రాంగణం “జయ జయ నరసింహా.. లక్ష్మీనరసింహా స్వామి గోవిందా అనే నామస్మరణతో మారుమ్రోగింది. గ్రామంలోని ఎస్సీ సామాజిక వర్గ భక్తులు ప్రతి ఏటా నిర్వహించే వంటల పండుగను ఈసారి కూడా భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.