ASR: అనంతగిరి మండలంలోని పెదకోట నుంచి జాలడ వరకు ఉన్న తారురోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని సర్పంచ్ గణేష్ ఆదివారం డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కొన్ని ఏళ్లుగా తారురోడ్డు పూర్తిగా ధ్వంసమై శిధిలావస్థకు చేరి కంకరరాళ్లు తేలి ఉందన్నారు. దీంతో ఈ రహదారి మీదుగా విశాఖ, అరకు, పాడేరుకు రాకపోకలు కొనసాగించేందుకు 300 గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.