SRD: రాయికోడ్ మండలం హస్నాబాద్ నుంచి కర్చల్ వరకు నిర్మిస్తున్న రోడ్డు బ్రిడ్జి పనులను మంత్రి దామోదర రాజన్న శివ ఆదివారం పరిశీలించారు. 4.5 కిలోమీటర్ల రోడ్డు బ్రిడ్జికి 6 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరిన చూడాలని సూచించారు.