TG: కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో కాంగ్రెస్ జనహిత యాత్ర ప్రారంభమైంది. TPCC చీఫ్ మహేష్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్, వివేక్ పాల్గొన్నారు. ఈ పాదయాత్ర గంగాధర మండలం ఉప్పరమల్యాల నుంచి మధురానగర్ వరకు కొనసాగనుంది. పాదయాత్రలో ప్రజాసమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించనున్నారు.