NRML:బీసీ సంక్షేమ యువజన సంఘం జిల్లా అధ్యక్షులుగా పొన్నం రాహుల్ గౌడ్‌ను నియమించినట్లు శనివారం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణ గౌడ్ ప్రకటించారు. ఈ సందర్భంగా యువజన జిల్లా అధ్యక్షులు రాహుల్ గౌడ్ మాట్లాడుతూ.. జిల్లాలో బీసీ యువతను ఏకం చేసి బీసీల హక్కులను సాధించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.